APTF VIZAG: Webex meeting key points

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Webex meeting key points

ఈరోజు రెండు గంటల నుండి ఐదు గంటల వరకు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి కార్యాలయం నుండి WebEx meeting సమావేశం జరిగింది. సదరు సమావేశంలో        

1.వచ్చే నెలలో జరిగే రేషనలైజేషన్ కౌన్సిలింగ్ ఈనెల 28వ తేదీ రోలు ఆధారంగా జరపబడును. కావున అందరూ గమనించి బాలబాలికల వివరాలను వెంటనే చైల్డ్ ఇన్ఫో నందు నమోదు చేయవలెను. అట్లు చేయని ప్రధానోపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకొనబడును.

2. ఆగస్టు ఒకటవ తేదీ నుండి ఉపాధ్యాయుల హాజరు మొబైల్ ద్వారా కొత్త యాప్ ద్వారా తీసుకొనబడును. సదరు యాప్ లో అన్ని రకాల లీవులు నమోదు చేయవలసి ఉంటుంది. కావున అన్ని రకాల లీవ్ రికార్డులు రెండు రోజుల లోపల అప్డేట్ చేయవలసి ఉంది.

3.విద్యా శాఖలో పనిచేయుచున్న రెగ్యులర్, కాంట్రాక్ట్, మరియు అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు మరియు బోధనేతర సిబ్బంది including MIS coordinators ,Data entry operators, జూనియర్ అసిస్టెంట్స్ రికార్డ్ అసిస్టెంట్ మరియు అటెండర్లు అందరూ కూడా టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం లో వారి యొక్క డేటా ఎంటర్ చేయవలెను. ఉపాధ్యాయుల ప్రమోషన్లు మరియు ట్రాన్స్ఫర్లు TIS డేటాను బేస్ చేసుకుని జరుగుతుంది కావున అందరూ వారి యొక్క డిజిగ్నేషన్స్ జాయినింగ్ మొదలగు అన్ని రకాల వివరాలు సరిగా ఉన్నవో లేదో చూసుకుని అప్ టు డేట్ చేసుకోవాల్సిందిగా కోరడమైనది.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results