APTF VIZAG: విద్యకు సంబంధించిన విధానపరమైన నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ఉపాధ్యాయులకు లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

విద్యకు సంబంధించిన విధానపరమైన నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ఉపాధ్యాయులకు లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

 ప్రీ ప్రైమరీ విద్య అవసరం లేదంటోన్న కొందరు ఉపాధ్యాయులు తమ పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు.

👉పాఠశాలలపై ప్రభుత్వ విధానాన్ని వద్దనే అధికారం ఉపాధ్యాయులకు లేదని బొత్స వ్యాఖ్యానించారు.

👉 ఉపాధ్యాయులంతా ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని చదివిస్తున్నారా? అని నిలదీశారు. 

👉ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతను పెంచేందుకే సంస్కరణలు చేపట్టామని.. రాష్ట్రంలో చేపట్టిన విద్యా సంస్కరణల యజ్ఞం ఫలితాలు వచ్చేందుకు సమయం పడుతుందన్నారు.

👉 సీబీఎస్ఈ, ఆంగ్ల మాధ్యమంలో బోధన, డిజిటల్ క్లాస్ రూమ్‌లు.. ఇలా వేర్వేరు అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని మంత్రి వెల్లడించారు. ఉపాధ్యాయులు చెబుతోన్న వివిధ అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు.

👉 ఉపాధ్యాయులు, ఉద్యోగులు ప్రభుత్వంలో అంతర్భాగమన్నారు.

👉 పాఠశాలల విలీనంపై విద్యార్థుల తల్లితండ్రులూ అభ్యంతరం చెప్పటం లేదన్నారు. 

👉ఎవరో కుట్రలు చేసి ఈ విధానాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారంటూ ఆరోపించారు.


పుస్తకాల విషయంలో జాప్యం నిజమే.

పాఠ్య పుస్తకాల విషయంలో జాప్యం జరిగిన మాట వాస్తవమని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

👉 పాఠశాల విద్యాశాఖ ఓ కఠిన నిర్ణయం తీసుకున్న కారణంగానే ఆలస్యమైందన్నారు.

👉 ప్రభుత్వం ఇచ్చిన సిలబస్, కరికులమ్ ఇచ్చిన తర్వాత ఏ ప్రైవేటు పాఠశాలా దాన్ని మార్చేందుకు వీల్లేదన్నారు. 

👉గతంలో ప్రైవేటు పాఠశాలలు తమ సబ్జెక్టులు కూడా కలిపేసి ముద్రించే వారన్న మంత్రి.. పరీక్షలు ఎప్పుడూ ప్రభుత్వం ఇచ్చిన సిలబస్ ఆధారంగానే జరుగుతాయని గుర్తించాలన్నారు.

👉 వ్యాపారం కోసం గతంలో ప్రైవేటు సంస్థలు ముద్రించేసి వాటినే విక్రయించుకునే వారన్నారు. 

👉ప్రభుత్వం ఇచ్చిన పుస్తకాలను మాత్రమే పంపిణీ చేసేలా ఈసారి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 

👉ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా ఇస్తున్నాం, ప్రైవేటు పాఠశాలలకు నిర్దేశిత ధరకే విక్రయిస్తున్నామన్నారు.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results