APTF VIZAG: Jagananna Gorumudda-Instructions on receiving of PM POSHAN / Jagananna Gorumudda rice from Fair Price Shops(FP Shop

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Jagananna Gorumudda-Instructions on receiving of PM POSHAN / Jagananna Gorumudda rice from Fair Price Shops(FP Shop

Receiving of Rice from FP Shops Instructions : HM లు వేలి ముద్ర వేసి మాత్రమే బియ్యం తీసుకోవాలి.

మధ్యాహ్న భోజన పథకం కోసం బియ్యాన్ని ప్రధానోపాధ్యాయులు/ ఏజెన్సీ వారు వేలి ముద్ర వేసి మాత్రమే తీసుకోవాలని మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కొన్ని పాఠశాలలకు బియ్యం కేటాయింపు జరగకపోవడం గమనించారు. దీనికి కారణం ప్రధానోపాధ్యాయులు చౌక ధరల దుకాణం నుండి వేలిముద్ర వేయకుండా మాన్యువల్ గా బియ్యం తీసుకోవడం వలన ఈ ఇబ్బంది తలెత్తుతుందని గమనించారు. బియ్యం తీసుకునే విషయంలో ఇదివరకే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి ఉన్నందువలన ప్రధానోపాధ్యాయులు ఎవరు మాన్యువల్ గా బియ్యం తీసుకోకూడదని సూచించారు. 

గతంలో ఇలా ప్రధానోపాధ్యాయులు మాన్యువల్ గా బియ్యం తీసుకోవడం వలన ఇబ్బందులు తలెత్తిన క్రమంలో రెండుసార్లు ఈ అంశాన్ని రాష్ట్రస్థాయిలో సరి చేయడం జరిగింది.

ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ వారు బియ్యాన్ని మ్యాన్యువల్ గా తీసుకోవడం వలన బియ్యం లెక్కలు సరిపోకపోవడం మరియు అక్రమాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. కావున విద్యాశాఖ అధికారులు అందరూ కూడా ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయులకు తెలియపరచ వలసిందిగా ఆదేశించారు.

ప్రధానోపాధ్యాయులు గమనించవలసిన అంశాలు

ప్రతి నెల పాఠశాలకు కావలసిన బియ్యం వివరాలను ఐ ఎం ఎం ఎస్ యాప్ లో 15వ తేదీ నుండి 20వ తేదీ మధ్యలో నమోదు చేయవలెను.

ప్రధానోపాధ్యాయులు అందరూ విధిగా వేలి ముద్ర వేసి ప్రతి నెలా 1వ తేదీ నుండి 15వ తేదీ లోపు బియ్యం ను తీసుకోవాలి.

చౌక ధరల దుకాణం వివరాలు మార్చుకోవాలి అనుకుంటే, బియ్యం తీసుకున్న తర్వాత ప్రతి నెలా 20వ తేదీన మార్పులు చేసుకోవచ్చు. 

ఈ ఆదేశాలను పాటిస్తూ ప్రతి నెలా బియ్యం తీసుకోవాలని, ఈ ఆదేశాలు పాటించని పక్షం లో ప్రధానోపాధ్యాయులను భాధ్యులు చేస్తూ ప్రధానోపాధ్యాయుల పై చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results