APTF VIZAG: Govt give Revised guidelines for New salaries

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Govt give Revised guidelines for New salaries

కొత్త పే స్కేళ్లతోనే జీతాలు . మరోసారి సర్కారు ఉత్తర్వులు

ఏపీ ప్రభుత్వం కొత్త పే స్కేళ్లతోనే జీతాలు చెల్లించేలా మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది . 11 వ పీఆర్సీ ప్రకారం జనవరి జీతాలు చెల్లించేలా బిల్లుల తయారీకి ఆదేశాలిచ్చింది . ఈ మేరకు డ్రాయింగ్ డిస్బర్స్మెంట్ , ట్రెజరీ , సీఎఫ్ఎంఎస్ అధికారులను సర్కారు ఆదేశించింది . ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ను అనుసరించి బిల్లుల చెల్లించాలని స్పష్టం చేసింది . 2018 జులై 1 నుంచి 2021 డిసెంబర్ 31 వరకు సర్వీస్ గణించాలని ఆదేశాలు జారీ చేసింది . కొత్త సాఫ్ట్వేర్ మాడ్యూల్ బిల్లులు అప్లోడ్ సూచించింది . ఎల్లుండిలోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆయా శాఖలకు ప్రభుత్వం స్పష్టం చేసింది . డీడీవోలకు కొత్త పే రోల్స్ అందుబాటులో ఉంచాలని సూచించింది . ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ . ఎస్ . రావత్ ఉత్తర్వులు జారీ చేశారు .





No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results