APTF VIZAG: పీఆర్సీపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం వివరాలు

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

పీఆర్సీపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం వివరాలు

ఈరోజు పీఆర్సీ అమలుపై ఆర్థిక శాఖ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాధ్, ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామక్రిష్ణారెడ్డి, జి.ఏ.డీ ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గార్లు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్య సంఘాలతో సమావేశం కావడం జరిగింది. సంఘాలు క్రింది అంశాలు ప్రతిపాదించడం జరిగింది.   

1) సి.పి.ఎస్ రద్దుపై హామీ నిలుపుకోవాలి.                 

2) కనీస వేతనం రు.20000/- బదులుగా రు.26,000/- అమలు చేయాలి.

3)ఫిట్ మెంట్ జె.ఏ.సి ఐక్య వేదిక 55 శాతం, ఎపిజిఇఎఫ్ 34 శాతం, ఎపిజిఇఏ 50 శాతం కోరారు.

4)MBF: ఐఆర్ ఇచ్చిన 1.7.2019 నుండి అమలు చేయాలి.

5)హెచ్.ఆర్.ఏ: పాతరేట్లు కొనసాగించాలి.

6)అడ్వాన్స్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి.

7) సెలవు సౌలభ్యాలు సిఫార్సు మేరకు అంగీకారం మరియు సరోగసి సెలవు మంజూరు చేయాలి.

8)పెన్షనర్లకు మెడికల్ అలవెన్స్ 500 బదులు 1000 అమలు చేయాలి.

9)పెన్షన్ కు సర్వీసుతో సంభంధం లేకుండా చివరి వేతనంలో 50 శాతం మంజూరు చేయాలి.

10)70 సం౹౹లు నిండిన పెన్షనర్లకు అడిషనల్ క్వాంటం పెన్షన్ కొనసాగించాలి.

11)ఎన్ హాన్సడ్ ఫ్యామిలీ పెన్షన్ జీవితాంతం కొనసాగించాలి.

12)గ్రాట్యుటీ గరిష్ట పరిమితి రు.20 లక్షలకు పెంచాలి.

13) సెంట్రల్ పే స్కేల్స్ అమలు వ్యతిరేకం. రాష్ట్ర పే స్కేల్స్ కొనసాగించాలి.

14)ఏ.ఏ.ఎస్ 5/10/15/20/25 అమలు చేయాలి.

15)పీఆర్సీ నివేదిక బహిర్గత పరచాలి. అధికారుల నివేదిక వ్యతిరేకిస్తున్నాము.

16)సి.సి.ఏ కొనసాగించాలి.

17)హోమ్ గార్డుల వేతనాలు పెంచాలి.

18)45 సం౹౹ల వయస్సు నిండిన వితంతువు/విడాకులు తీసుకున్న కుమార్తెలకు ఫ్యామిలీ పెన్షన్ కొనసాగించాలి.

19)అంత్యక్రియల ఖర్చులు ఉద్యోగులు, పెన్షనర్లకు రు.30,000/- లకు పెంచాలి.

20) ఫుల్ టైం కంటింజెంట్/ ఒప్పంద ఉద్యోగులకు కనీస వేతనంతో పాటు డీఏ, హెచ్.ఆర్.ఏ చెల్లించాలి.                21) జె.ఏ.సి మిగిలిన 70 డిమాండ్లను పరిష్కరించాలని కోరడం జరిగింది.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results