APTF VIZAG: ఆగ‌స్టు 16న పాఠ‌శాల‌లు పునఃప్రారంభిస్తాo- విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్.

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

ఆగ‌స్టు 16న పాఠ‌శాల‌లు పునఃప్రారంభిస్తాo- విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్.

ఆగ‌స్టు 16న రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠ‌శాల‌లు పునఃప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​ పునరుద్ఘాటించారు.

☆ కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పాఠశాలలు తెరుస్తున్నామన్నాారు. 

☆ ఉపాధ్యాయుల్ని విద్యార్థుల ఇంటికి పంపి సన్నద్ధతకు ఏర్పాట్లు చేస్తున్నారని మంత్రి వివరించారు. 

☆ ఉపాధ్యాయుల‌కు ఆగ‌స్టు16లోగా 100శాతం బూస్టర్ డోస్ వ్యాక్సిన్ పూర్తిచేయాల‌ని సీఎం జగన్​ ఆదేశించినట్లు తెలిపారు.

☆ నాడు-నేడు ప‌నులు 98శాతం పూర్తయ్యాయని.. ఆగస్టు 16న సీఎం జగన్ వీటిని ప్రజ‌ల‌కు అంకితం చేస్తారని పేర్కొన్నారు. 

☆ అదేరోజు నాడు-నేడు రెండోదశ కింద రూ. 4వేల కోట్లతో 16వేల స్కూళ్ల రూపురేఖ‌లు మార్చే కార్యక్రమం ప్రారంభిస్తారన్నారు. 

☆ అమ్మ ఒడి వ‌ద్దన్న 9 ల‌క్షల మంది, డిగ్రీ కాలేజీల్లో వ‌స‌తి దీవెన వ‌ద్దనుకుంటున్న విద్యార్థులకు వ‌చ్చే విద్యాసంవ‌త్సరం నుంచి ల్యాప్​ట్యాప్​లు ఇస్తామన్నారు.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today