APTF VIZAG: ఉపాధ్యాయ సంఘాలతో నేడు జరిగిన సమావేశంలోని అంశాలు:

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

ఉపాధ్యాయ సంఘాలతో నేడు జరిగిన సమావేశంలోని అంశాలు:

 టీచర్స్ లేరు కాబట్టి 1:20 రేషయో ప్రకారం టీచర్స్ ని ఇవ్వలేము

5 వేలు LFL ఉన్నారు

టీచర్స sgt 87 వేలు ఉన్నారు.

34 వేలు స్కూల్స్ నడపాలి

60 మందికి ఇద్దరిని ఇస్తాము

పోస్టులు బ్లాక్ చేయటాన్ని ఎవ్వరం ఒప్పుకొము...యూనియన్స్

మాన్యువల్ కౌన్సిలింగ్ తప్పినిసరిగా పెట్టాలి.ఒక టీచర్ 3000 ఆప్షన్స్ పెట్టలేరు...

కమిషన్ ర్ సమాధానం పరిశీలిస్తాం.

Octo ber, november లో రిటైర్ అయ్యేవారికి మాత్రేమే ప్రమోషన్ లో ఏదో ఒక ఖాళీ చూపిస్తాం

19,20 న విల్లింగ్ తీసుకొని ఆసక్తి ఉన్నవారికి ప్రమోషన్ ఇస్తాము

పండిట్స్ కి కూడా  ఖాళీగా ఉన్న SA లలో ప్రమోషన్ ఇస్తాము.మిగిలిన వారిని UP స్కూల్లో సర్దుపాటు చేస్తాము

Promotions కు అన్ని ఖాళీలు చూపిస్తాము

2019 లో ఇచ్చిన promotions ఖాళీలు గాచూపించమని అందరూ యూనియన్ వారు అడిగారు.

ఎస్ జి టి లకు యాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించమని కోరగా, ఈ విషయంపై తప్పనిసరిగా పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలియజేశారు.

చైల్డ్ ఇన్ఫో నందు ఉన్న రోలు ఉన్న వ్యత్యాసాన్ని హెచ్ఎం ల డిక్లరేషన్ ను  పరిశీలించి తగు విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

పీఈటీ, పండిట్ తదితర పదోన్నతుల స్థానాలను వేకెన్సీ లుగా చూపుటకు లీగల్ ఇష్యూ ఉన్న కారణంగా ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉత్తర్వులు ఇస్తామని తెలియజేశారు.

సర్వీస్ పాయింట్ లను 0.5 నుండి 1 పెంచమని కోరగా సర్వీస్ పాయింట్ లను పెంచలేమని తెలియజేశారు.

కేటగిరీల వారీగా ఖాళీలను బ్లాక్ చేయకుండా అన్ని ఖాళీలను కౌన్సిలింగ్ నందు చూపించడానికి కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలియజేశారు.

 ప్రస్తుత పదోన్నతుల విషయంపై బదిలీలకు ముందు నిర్వహించడమా లేక తర్వాత నిర్వహించిడమా అనే విషయంపై స్పష్టతను ఇస్తామని తెలియజేశారు.

పండిట్ పదోన్నతుల విషయంలో థర్డ్ మెథడాలజీ చేసినవారిని కూడా పదోన్నతికి అర్హత కల్పిస్తూ ఉత్తర్వులు ఇస్తామనీ, కానీ MA తెలుగు వారికి సంబంధించిన విషయం లీగల్ గా కోర్టులో ఉన్నందున, కోర్టు ఉత్తర్వుల తర్వాత దానిపై నిర్ణయం తీసుకోగలమని తెలిపారు.

 పదవీ విరమణకు మూడు సంవత్సరాల లోపు ఉన్న వారికి బదిలీల నుంచి మినహాయింపు కోరగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలియజేశారు.

పై అన్ని విషయాలపై ఉపాధ్యాయ సంఘాల నుండి తీసుకున్న సమాచారం ప్రభుత్వానికి పంపి, తగిన విధంగా ఉత్తర్వులు విడుదల చేస్తామని తెలిపారు.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results