APTF VIZAG: Meeting with Education department and unions

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Meeting with Education department and unions

యూనియన్ నాయకులతో జరిగిన చర్చల సారాంశం మరియు APTF GENERAL SECRETARY PANDURANGA VARAPRASAD గారి వీడియో సందేశం.



ఈరోజు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు గారు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాన్ని నిర్వహించారు సమావేశం నాలుగు గంటల నుండి 9:30 వరకు జరిగింది సమావేశం సూహృద్భావ వాతావరణంలో జరిగింది. ముఖ్యాంశాలు

1. జూలై 7వ తేదీ వరకు అందరూ పాఠశాలలకు వెళ్లి u dise ఇంకా ఇతర పనులు పూర్తి చేయాలి
2.  ఏడో తేదీ నుండి విద్యార్థులకు ఆన్లైన్  లేదా ఇతర పద్ధతుల్లో బోధనకు ప్రణాళికను రూపొందించి మనకు అందించడం జరుగుతుంది. వారంలో ఎన్ని రోజులు పాఠశాలకి వెళ్ళాలి ,అనే విషయం త్వరలో కమిషనర్ గారు తెలియజేస్తారు
3. containment జోన్ లో నివసించే వారు కూడా పాఠశాలకు వెళ్లనవసరం లేదని కమిషనర్ గారు తెలియజేశారు.ఇంతకు ముందు ఉత్తర్వుల్లో పేర్కొంది మినహాయింపులు అన్నీ కొనసాగుతాయి.
4. బయోమెట్రిక్ విధానంపై చాలా సీరియస్ గా చర్చ జరిగిన అనంతరం పరిశీలిస్తామని చెప్పారు. బయోమెట్రిక్ పై మినహాయింపును ఇవ్వవచ్చు.
5.హేతుబద్ధీకరణ ప్రాథమిక పాఠశాలలలో 1: 30 నిష్పత్తి ప్రకారం జరుగుతుంది. అయితే 8 వేల పోస్టులు మిగులుతాయి కనుక వాటిని 40-60 విద్యార్థులున్న పాఠశాల లకుమూడవ పోస్టు గా కేటాయిస్తారు. పోస్టులు ఇంకా మిగిలితే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న వాటికి కేటాయిస్తారు.
6.ఉన్నత పాఠశాలలకు సంబంధించి అసంబద్ధత లను కమిషనర్  గారిదృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది .ముఖ్యంగా సోషల్ స్టడీస్ ,పి .ఎస్., బయాలజీ
 పోస్టులలో మార్పులు  సూచించడం జరిగింది .వాటికి కమిషనర్ గారు అంగీకరించారు.
7. తెలుగు ఆంగ్ల మాధ్యమాల్లో వేరువేరుగా పరిగణిస్తారు ఆంగ్ల మాధ్యమం విద్యార్థులు 200 లోపు ఉంటే టేబుల్ 3 ఏ కు అదనంగా నాలుగు పోస్టులు కేటాయిస్తారు..ఆంగ్ల మాధ్యమం విద్యార్థులు 240 కంటే ఎక్కువ మంది ఉంటే వేరే సెక్షన్ గా పరిగణించి అన్ని పోస్ట్ లు ఇస్తారు..
8. బదిలీలు వెబ్ కౌన్సెలింగ్ ద్వారా జరుగుతాయి
9. డి ఈ ఓ పూల్ లో ఉన్న పం డిట్ లు అందరిని అవసరమైన ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్జిటి పోస్టుల్లో  నియమిస్తారు
10. డీ ఈ ఓ పూల్లో ఉన్న ఉపాధ్యాయులు అందరిని ముందుగా నియమిస్తారు
11. ఖాళీలను చూపించడానికి 1-7 -2020 నీ ప్రాతిపదికగా తీసుకుంటారు
12. మినిమమ్ రెండు సంవత్సరాలు మ్యాగ్జిమం ఎనిమిది ఎకడమిక్ ఇయర్స్ పరిగణిస్తారు
13. స్పెషల్ కేటగిరీలకు ఐదు పాయింట్లు మాత్రమే కేటాయించారు.
14.టోటల్ సర్వీస్ పాయింట్లు గతంలో వలే ఉంటాయి
15.స్టేషన్ సర్వీస్ పాయింట్ లు
క్యాటగిరిI -1
క్యాటగిరి II-2
 క్యాటగిరిIII- 3
 కేటగిరి  IV -5 పాయింట్లు కేటాయిస్తారు
16 . జులై 2019 నుండి ఇచ్చిన పదోన్నతుల ను ఖాళీగా చూపించే విషయం ఆలోచించి నిర్ణయిస్తామని చెప్పారు.
17. ప్రతిభ ఆధారితపాయింట్స్ తొలగించారు.
18. ఖాళీగా ఉన్న డ్రాయింగ్ క్రాఫ్ట్ మ్యూజిక్ డాన్స్ మొదలైన పోస్టులను రద్దు చేసి ఇ వాటి బదులుగా ప్యానల్ హెడ్మాస్టర్ పోస్ట్లు హెడ్మాస్టర్ పోస్టులు  ఎస్ జి టి పోస్ట్లు మంజూరు చేసే విషయం పరిశీలిస్తున్నారు.
19. ఏ టీచర్ పోస్టు  రద్దు కాదు.
20. హై స్కూల్స్ లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువ అయితే ప్రాథమికోన్నత పాఠశాల నుండి పంపించడం జరుగుతుంది

కె.భానుమూర్తి, అధ్యక్షులు,
పి. పాండురంగ వరప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి
ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (257)

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results