APTF VIZAG: విద్యా సంస్థల పర్యవేక్షణకు జీవో నెంబర్ 28 జారీ మరియు వెబ్ సైట్ ఆవిష్కరించిన సీఎం.

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

విద్యా సంస్థల పర్యవేక్షణకు జీవో నెంబర్ 28 జారీ మరియు వెబ్ సైట్ ఆవిష్కరించిన సీఎం.


School Education Department– The Andhra Pradesh School Education Regulatory and Monitoring Commission Rules, 2020 – Notification- Issued
Click Here To Download GO No 28,dt:28-5-20
వసతులు, ప్రమాణాల వివరాలను స్కూళ్లు, కాలేజీలు అప్లోడ్ చేయాలి.
తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు.
డొమైన్ అందరికీ అందుబాటులో ఉంటుంది.
వసతులు లేకపోతే ఫిర్యాదు చేయొచ్చు.
Click Here To WEBSITE 

విద్యా సంస్థల పర్యవేక్షణ కోసం ప్రత్యేక వెబ్ సైట్ ఏర్పాటైంది. దీనిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.

విద్యా రంగంపై మేధోమథన సదస్సు అనంతరం  ఈ వెబ్ సైట్ ను సీఎం ఆవిష్కరించారు. తమ విద్యా సంస్థల్లోని వసతులు, పాటిస్తున్న ప్రమాణాలపై ఆయా స్కూళ్లు, కాలేజీలు స్వయంగా వెబ్ సైట్ లో వివరాలు అప్లోడ్ చేస్తాయని, డొమెయిన్ అందరికీ అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు.

వెబ్ సైట్ లో పేర్కొన్న వసతులు, ప్రమాణాలు నిజంగా క్షేత్రస్థాయిలో లేకపోతే ఎవరైనా స్పందించి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ వెబ్ సైట్ అందరికీ అందుబాటులో ఉంటుందని సీఎం చెప్పారు.
వెబ్ సైట్ ఐడీ : www.apsermc. ap. gov. in

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. విద్యా రంగంలో కార్పొరేట్ సంస్కృతికి చెక్ పెడుతున్నామని.. అందుకోసం రెండు కమిషన్లు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. వీటి బాధ్యతలను ఇద్దరు హైకోర్టు జడ్జీలు జస్టిస్ ఆర్.కాంతారావు, జస్టిస్ ఈశ్వరయ్యకు అప్పగించామన్నారు. ఒకరు పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌కు, మరొకరు ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ బాధ్యత వహిస్తారని చెప్పారు. ఇప్పటికే ఆ కమిషన్లు పనులు మొదలు పెట్టాయన్నారు.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results