APTF VIZAG: E-filing date extended 31-8-2019.ఐటీ రిటర్నుల దాఖలు గడువు పెంపు

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

E-filing date extended 31-8-2019.ఐటీ రిటర్నుల దాఖలు గడువు పెంపు

ఐటీ రిటర్నుల దాఖలు గడువు పెంపు.

🔸ఆదాయపు రిటర్నులు దాఖలు చేసే వారికి శుభవార్త. 2018-19 సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించడానికి గడువు తేదీని ప్రభుత్వం ఆగస్టు 31వ తేదీ వరకూ పొడిగించింది.

🔹సాధారణంగా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించడానికి చివరి తేదీ జులై 31. ఇప్పుడు ఆ గడువు మరో నెలరోజులు పెంచింది. ‘ఆదాయపు పన్ను రిటర్నుల సమర్పణ గడువు తేదీని జులై 31, 2019 నుంచి ఆగస్టు 31, 2019 వరకూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పెంచింది.
🔸వివిధ కేటగిరీలకు చెందిన పన్ను చెల్లింపుదారులు ఆ తేదీలోగా రిటర్నులను సమర్పించాల్సి ఉంటుంది’ అని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఐటీఆర్‌ సమర్పణ గడువు తేదీని పెంచాలని వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
🔹ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు చివరి నిమిషం వరకూ వేచి చూడకుండా.. రిటర్నులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
🔸ఈ గడువు దాటిన తర్వాత కూడా రిటర్నులు దాఖలు చేయొచ్చు. దీనికిగాను కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
🌺డిసెంబరు 31, 2019 వరకూ అయితే రూ.5,000.*
ఆ తర్వాత రిటర్నులు దాఖలు చేయడానికి చివరి తేదీ.. మార్చి 31, 2020. దీనికోసం రూ.10,000 చెల్లించాలి.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results