నేటి ఏ పి కేబినెట్ మీటింగ్ ముఖ్యాంశాలు
👉జిల్లా గ్రంథాలయాల సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్ళకు పెంపు
👉ఎయిడెడ్ ప్రైవేటు విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం
👉హైస్కూళ్ళల్లో నైట్ వాచ్ మ్యాన్ ల నియామకానికి ఆమోద ముద్ర పడింది.. నెలకు ఆరు వేల రూపాయల గౌరవ వేతనం
👉 టాయిలెట్ నిర్వహణా నిధి నుంచి చెల్లించే విధంగా నిర్ణయం
👉ఏపీఐఐసీ చేసిన 50 ఎకరాల లోపు కేటాయింపులను ర్యాటిఫై చేసిన క్యాబినెట్
👉అమలాపురం కేంద్రంగా అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు కు క్యాబినెట్ ఆమోదం
👉ఏపీ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం బిల్లు - 2023 కు ఆమోదం
👉ఎక్సైజ్ చట్టం సవరణకు ఆమోదం
👉అన్ని దేవస్థానాల బోర్డులలో ఒక నాయీ బ్రాహ్మణుడిని సభ్యుడిగా నియమించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.
👉దేవాలయాల్లో క్షుర ఖర్మలు చేస్తున్న నాయీ బ్రాహ్మణులకు కనీసం నెలకు 20వేలు కమిషన్ అందించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. కనీసం వంద పనిదినాలు ఉన్న క్షురకులకు ఇది వర్తింపు.
👉పట్టాదారు పాస్ బుక్స్ ఆర్డినెన్స్-2023 సవరణకు కేబినెట్ ఆమోదం
No comments:
Post a Comment