APTF VIZAG: ప్రమోషన్ పొందిన సందర్భంలో వేతన స్థిరీకరణ-ఎఫ్ ఆర్ 22 బి ప్రాధాన్యత గురించి… వివరణ.

ప్రమోషన్ పొందిన సందర్భంలో వేతన స్థిరీకరణ-ఎఫ్ ఆర్ 22 బి ప్రాధాన్యత గురించి… వివరణ.

👉 25.12.1982 తదుపరి అదనపు బాధ్యతలు గల పోస్టు నందు నియమించబడిన వారికి ఈ నిబంధన వర్తిస్తుంది. 1992, 1998 పిఆర్సీ స్కేళ్ళలో 8సంవత్సరాల స్కేలు పొందకుండానే ప్రమోషన్ వచ్చిన వారికి ఎఫ్ ఆర్ 22బి ప్రకారం, 8/16 స్కేళ్ళు పొందుతూ ప్రమోషన్ వచ్చిన వారికి ఎఫ్ ఆర్ 22ఎ(1)ప్రకారం వేతన స్థిరీకరణ చేయబడేది.
👉 2005 పిఆర్సీ సిఫార్సులకు అనుగుణంగా ఇవ్వబడిన ఆటోమాటిక్ అడ్వాన్మెంట్ స్కీమ్ జివో 241 ఆర్థిక తేదీ: 28-09-2005 ద్వారా 8/16 స్కేళ్ళు పొందుతూ ప్రమోషన్ వచ్చిన వారికి కూడా ఎఫ్ ఆర్ 22బి ప్రకారం వేతన స్థిరీకణలో రెండు ఇంక్రిమెంట్లు లభిస్తాయి.
👉 2010, 2015 వేతన స్కేళ్లలో ఆర్డినరీ 6/12/18 స్కేళ్లు పొందుతూ ప్రమోషన్ వచ్చిన వారికి ఎఫ్ ఆర్ 22బి ప్రకారం వేతన స్థిరీకరణ జరుగుతుంది.
👉 దీని ప్రకారం క్రింది పోస్టులో వేతనమునకు ఒక నోషనల్ ఇంక్రిమెంట్ కలిపి సదరు వేతనం ఆధారంగా పై పోస్టు యొక్క స్కేలులోని తదుపరి స్థిరీకరణ వేతన స్థిరీకరణ చేయబడుతుంది.
👉 ఈ నిబంధన ప్రకారం వేతన స్థిరీకరణ రెండు విధాలుగా చేయవచ్చు.
👉 1. ‘వాస్తవ ప్రమోషన్’ తేదీ నాడు గానీ లేదా
👉 2. క్రిందిపోస్టులోని తదుపరి ‘ఇంక్రిమెంట్’  తేదీ నాడు గానీ వేతన స్థిరీకరణ చేయవచ్చును.
👉జివో ఎంఎస్ నెం. 145, ఆర్థిక తేదీ: 19.05.2009 ప్రకారం ఉద్యోగికి లాభదాయకంగా ఉండే విధానంలో  పైరెండింటిలో దేనిప్రకారం అయిన ఉద్యోగి ఆప్షన్ తో పనిలేకుండానే వేతన నిర్ణయం చేసేబాధ్యత డ్రాయింగ్ అధికారికి కల్పించబడింది.
👉ఉదాహరణ: అక్టోబర్ నెల ఇంక్రిమెంట్ తేదీగా గల 'రవి'  అనే ఉపాధ్యాయుడు తేదీ: 06.07.2019న స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందినాడు. సదరు తేదీనాటికి అతని వేతనం రూ.28940 – 78910 స్కేలులో రూ.44870/-లు గా ఉన్నది. వీరి వేతనం ఎఫ్ ఆర్ 22బి ప్రకారం రెండు విధాలుగా స్థిరీకరించవచ్చు.
👉ప్రమోషన్ తేదీనాడు వేతన స్థిరీకరణ:
👉1. తేదీ: 06-07-2019 నాటికి ఎస్జిటి పోస్టులో మూల వేతనం మరియు స్కేలు:రూ, 44,870/-స్కేలు 28940 – 78910
👉2. ఎఫ్ ఆర్ 22బి ప్రకారం ఒక నోషనల్ ఇంక్రిమెంటు మంజూరు :రూ, 46060/- స్కేలు 28940 – 78910
👉3. స్కూల్ అసిస్టెంట్ స్కేలులో తదుపరి స్టేజిలో వేతన నిర్ణయం : రూ,47330/- స్కేలు 28940 – 78910
👉4. తదుపరి ఇంక్రిమెంట్ తేదీ:  01.07.2020
👉ఇంక్రిమెంట్ తేదీ ప్రమోషన్ తేదీకి అంటే జులై నెలకు మారుతుంది
👉క్రింది పోస్టులోని ఇంక్రిమెంట్ తేదీనాడు వేతన స్థిరీకరణ:
👉1. తేదీ 03.07.2019 నాటికి ఎస్జిటీ పోస్టులో మూల వేతనం మరియు స్కేలు: రూ, 44,870/- స్కేలు 28940-78910
👉2. పదోన్నతి పొందిన రోజున ఎఫ్ ఆర్ 22(1) ప్రకారం వేతన నిర్ణయం: రూ, 46060 స్కేలు 28940-78910
👉3. తేదీ 01.10.2019న ఎస్జిటి పోస్టులో వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు: రూ, 47,330 స్కేలు 28940 – 78910
👉4. ఎఫ్ ఆర్ 22బి ప్రకారం ఒక నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు(10/19)న:  రూ, 47330/- స్కేలు 28940 – 78910
👉5. స్కూల్ అసిస్టెంట్ పోస్టు స్కేలులో తదుపరి స్టేజిలో వేతన నిర్ణయం (10/19)న :  రూ,48,600/-  స్కేలు 28940 – 78910
👉6. తదుపరి ఇంక్రిమెంట్ తేదీ:  01.10.2020
👉పై రెండు పద్దతుల్లో ఇంక్రిమెంట్ తేదీకి వేతన నిర్ణయం చేయడం లాభదాయకంగా ఉంటుంది. ఇంక్రిమెంట్ తేదీ పాతదే అంటే అక్టోబర్ నెల కొనసాగుతుంది.
👉24 సంవత్సరాల స్కేలు పొందుతూ ప్రమోషన్ వచ్చినవారికి  ఈ నిబంధన వర్తించదు. వారికి  ఎఫ్ ఆర్22ఎ (1) నిబంధన వర్తిస్తుంది. దాని వలన ఒక ఇంక్రిమెంట్ ప్రయోజనం లభిస్తుంది.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today